ప్రభుత్వ ఛాతి  ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే,కలెక్టర్

ప్రభుత్వ ఛాతి  ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే,కలెక్టర్

 హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డు  సమీపంలోని ప్రభుత్వ ఛాతి, క్షయ వ్యాధుల అసుపత్రిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని  ఓపి విభాగంతో పాటు  మేల్, ఫిమేల్ వార్డులు, ఆర్ఐసీయూ, బ్రాంకోస్కోపీ రూమ్, సెమినార్ హాల్ ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య  పరిశీలించారు. 

 ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించి అందిస్తున్న వైద్య సేవలు, కావాల్సిన సదుపాయాలను గురించి  ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రి ఇంచార్జ్  సూపరింటెండెంట్  డాక్టర్ సునీత, వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

 ఆసుపత్రి భవనానికి పునరుద్ధరణ చర్యలు, ఇతర మరమ్మతు పనులు చేయించాలని, పలు సదుపాయాలు కల్పించాలని వైద్యులు సిబ్బంది కోరగా ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని లలితాదేవి, రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకటేష్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2024-10-24 at 9.42.49 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .