మహిళల ఆత్మనిర్భరతకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేయూత
మల్కాజ్గిరి, సెప్టెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలనే లక్ష్యంతో మల్కాజ్గిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి విశేష సహకారం అందించారు.మల్కాజ్గిరి నియోజకవర్గం లో సర్దార్ పటేల్ నగర్ మహిళలకు శిక్షణ కోసం ఆయన స్వంత నిధులు మొత్తం 2,50,000 రూపాయలు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా స్టిచ్చింగ్ మెషీన్లు 5, జూకి మెషీన్లు 5, పికో మెషీన్లు 2, కట్టింగ్ టేబుల్స్ 2, చెయర్స్ 50, మీటింగ్ టేబుల్ 1, మెషీన్ స్టూల్స్ 12, అల్మార 1 ను మహిళలకు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి మాజి కార్పొరేటర్ నిరుగొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ – “ఎమ్మెల్యే సహకారం వల్ల స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగి, కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుంది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు చంద్రకళ, ప్రేమలత, తార, లక్ష్మి, లలిత పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డోలీ రమేష్, జనార్ధన్, బంటి, నవీన్ తదితరులు హాజరయ్యారు.స్థానిక మహిళలు మాట్లాడుతూ – “ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సాయం మా జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. ఈ పరికరాలతో శిక్షణ పొంది, భవిష్యత్తులో స్వయం ఉపాధితో ముందుకు సాగుతాం” అని కృతజ్ఞతలు తెలిపారు.


Comments