వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి

పెద్దమందడి,అక్టోబర్29(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మేఘా రెడ్డి బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోకూడదని, రైతులు నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్,మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శాఖ వెంకటయ్య, చేనేత ఉన్ని పరిశ్రమ సంఘం ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, సత్య రెడ్డి, రామచంద్రయ్య గౌడ్, ఏపిఎం సక్కుర్ నాయక్, జిల్లా అధికారులు మహిళా సంఘం  వివోఏలు శాంతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-10-29 at 8.15.13 PM

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .