బాధితునికి ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
పాల్గొన్న సాయి చరణ్ రెడ్డి, ఎం.రవి నాయక్
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి నియోజకవర్గంఖిల్లా ఘనపుర్ మండలం అలమాయి పల్లి గ్రామం,అలమాయి పల్లి కు చెందిన మొల్గరా రవి కి మెరుగైన వైద్య చికిత్సలు చేయించుకునేందుకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రూ.1,50,000/- విలువగల ఎల్ ఓ సి నీ, బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఇటీవల అనారోగ్యాన్ని గురైన ఆయన కుటుంబం మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఆర్థిక పరిస్థితి సరిగా లేదని వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి నీ ఎల్ ఓ సి మంజూరు చేయాలని కోరగా, అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం తరఫున 1లక్షా 50వేల రూపాయల విలువగల ఎల్ ఓ సి నీ, మంజూరు చేయించి బాధిత కుటుంబ సభ్యులకి అందజేశారు. తమ వైద్య సేవ కోసం ఎల్ ఓ సి మంజూరు చేయించిన ఎమ్మెల్యే కు బాధ్యత కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి.సాయి చరణ్ రెడ్డి, దిశా కమిటీ నెంబర్ మూడవత్ రవి నాయక్ , నర్సిములు, హరీశ్, చెన్నయ్య బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


Comments