సత్తుపల్లి–పెనుబల్లి మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
- దుకాణ ప్రారంభాలు–పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం.
సత్తుపల్లి, నవంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణం నుంచి గ్రామాల వరకూ పర్యటిస్తూ ప్రజలను పలకరించారు.
సత్తుపల్లి పట్టణంలోని బాలాజీ థియేటర్ ఎదుట ఏర్పాటు చేసిన సిరి జ్యూయలరీస్ నూతన దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక ప్రజలు, వ్యాపారవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తరువాత సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలోని నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
పెనుబల్లి మండలం వి.ఎం. బంజర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఒక గ్రాము బంగారు ఆభరణాలు, అలంకార వస్తువుల దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అదే గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల విరుముడి పూజల్లో పాల్గొన్నారు.
రోజు కార్యక్రమాల్లో భాగంగా సత్తుపల్లి పట్టణం 23వ వార్డులో నివసిస్తున్న పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు వాసిరెడ్డి మధుసూదన్ రావును అనారోగ్యం కారణంగా వెళ్లి పరామర్శించారు.
కార్యక్రమాల్లో పురపాలక కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మండల అధ్యక్షుడు శివా వేణు, పెనుబల్లి మండల అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, మాజీ ఉపాధ్యక్షులు తోట సుజలా రాణి, కమల్ పాషా, కిసర రాంబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments