ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిన మాదిరి ఎన్నికలు

ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిన మాదిరి ఎన్నికలు

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్’ మాదిరి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు ధర్మ ప్రకాష్ అధ్యక్షత వహించారు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు రామకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించారు.ఈ ఎన్నికల కార్యక్రమం గత పది రోజులుగా విద్యార్థి అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ పత్రాల స్వీకరణ, గుర్తుల కేటాయింపు, ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్, మరియు ఫలితాల ప్రకటనలతో చురుగ్గా సాగింది. అభ్యర్థులు తమ కార్యాచరణ ప్రణాళికను విద్యార్థులకు వివరించడం ద్వారా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ ఎన్నికల్లో పదవ తరగతి విద్యార్థి సిద్ధు, 9వ తరగతి విద్యార్థి కార్తీక్, 8వ తరగతి విద్యార్థి మనోజ్ వరుసగా మొదటి మూడు స్థానాలు సాధించి, స్టూడెంట్ క్యాబినెట్‌కు ఎన్నికయ్యారు.ముగింపు సమావేశంలో ఉపాధ్యాయులు కవిత, సురేష్, పద్మజ, రాజమ్మ, కిరణ్ మైలు తదితరులు ఎన్నికల ప్రక్రియ విజయవంతమైన నేపథ్యంలో విద్యార్థులకు ప్రజాస్వామ్య పాఠాలను వివరించారు. ప్రత్యేకంగా ఓటు ప్రాముఖ్యత, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించవచ్చో, విద్యార్థులుగా సమాజ అభివృద్ధిలో వారి పాత్ర ఏమిటి అనే విషయాలను వివరిస్తూ, విద్యార్థుల్లో సమాజంలో చైతన్యం కలిగేలా ప్రేరణ నింపారు.ఈ కార్యక్రమం ప్రజాస్వామ్య సిద్దాంతాలను ప్రాతిపదికగా విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంలో ముందడుగుగా నిలిచింది.WhatsApp Image 2024-12-19 at 5.07.08 PM (1)

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .