జిల్లా లో లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదు 

రెండు లక్షల రూపాయలు లోపు పూర్తి అనే ప్రభుత్వ ప్రకటన మోస పూరితం

జిల్లా లో లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదు 

రైతు రుణమాఫీ పై నేటి నుంచి  రైతు పోరు బాట 

తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

జిల్లాలో లక్ష మంది రైతులకు పైగా రుణమాఫీ కాలేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గురువారం ఖమ్మం సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగిన రైతు సంఘం సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ప్రక్రియ పూర్తి యినట్లు గా ప్రకటన చేయటం రైతులను మభ్య పెట్టేందుకు అని అన్నారు,  ఖమ్మం డిసిసిబి పరిధిలో 80 వేల మందికి పైగా రైతుల రుణమాఫీ చేయకుండా పూర్తి ఎలా అవుతుంది అని అన్నారు ,  నవంబర్ 30 రైతు విజయోత్సవ సభ లో విడుదల చేసిన మూడు వేల కోట్ల రూపాయల్లో ఒక రూపాయి కూడా ఇంకా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయలేదు అన్నారు. వ్యవసాయ అధికారులు, బ్యాంకు అధికారులు కనీసం నాలుగు విడత రుణమాఫీ జాబితాలో పేర్ల వివరాలు కూడా రైతులకు చెప్పె పరిస్థితి లేదని అన్నారు.
ఆధార్ కార్డ్ బ్యాంకు ఎకౌంటు అనుసంధానం లో జరిగిన తప్పులు,  ఇంటి పేర్లు, రైతులు పేర్లు, ఆధార్ కార్డు లో ఉన్న పేరు సరిపోల్చ లేదని టెక్నికల్ సమస్యలు పేరుతో వేలాదిమంది రైతులు రుణమాఫీ చేయలేదు అన్నారు, బ్యాంకులో రుణం పొందినప్పుడు పట్టాదార్ పాస్ పుస్తకం కలిగి ప్రస్తుతం పట్టాదారు పాస్ పుస్తకం లేని రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు రైతు మరణించి ఉంటే అలాంటి వారికి కూడా రుణమాఫీ వర్తించలేదని  అన్నారు . రుణమాఫీలో సమస్యలకు బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారుల  తప్పిదం  గా ప్రభుత్వం వారిపై మోపి సమస్య నుంచి తప్పుకోవాలని చూస్తుందని అన్నారు.
ప్రభుత్వం వెంటనే రుణమాఫీ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు, రుణమాఫీ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి  జిల్లా వ్యాప్తంగా  గ్రామాల్లో రైతు సర్వే, ఆందోళన వారం రోజులు పాటు కొనసాగిస్తాం అన్నారు. రైతులనుంచి వివరాలు సేకరణ పూర్తి చేసి పోరాటం నిర్వహించాలని సమావేశం తీర్మానించింది, రైతులు పోరాటం లో  స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చింది ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బండి రమేష్, వాసిరెడ్డి ప్రసాద్, సహాయ కార్యదర్శులు చింత నిప్పు చలపతిరావు, ఎస్ కె మీరా,బిక్కసాని గంగాధర్ , వీరబాబు తదితరులు పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .