కేయూ బాలికల ఇంజనీరింగ్ కాలేజ్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎంపి కావ్య 

కేయూ బాలికల ఇంజనీరింగ్ కాలేజ్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న ఎంపి కావ్య 

హన్మకొండ,సెప్టెంబర్19(తెలంగాణ ముచ్చట్లు):

కాకతీయ యూనివర్సిటీ బాలికల ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు.WhatsApp Image 2025-09-19 at 6.58.11 PM (1)

ఈ సందర్భంగా డాక్టర్ కావ్య మాట్లాడుతూ, పువ్వులను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ప్రపంచంలో ఆడబిడ్డలు పువ్వులను పూజించే ప్రత్యేక సంస్కృతి తెలంగాణలోనే ఉందని గుర్తుచేశారు. రాణి రుద్రమదేవి, సమ్మక్క–సారక్క, చాకలి ఐలమ్మ వంటి మహనీయుల ధైర్యసాహసాలు ఓరుగల్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు.

విద్యార్థినులు అనుకున్నది సాధించాలంటే క్రమశిక్షణతో కష్టపడి చదవాలని, అప్పుడు మాత్రమే విజయం సాధ్యమవుతుందని ప్రోత్సహించారు. సోషల్ మీడియా వినియోగంలో, కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .