ఎంపీ రఘురాం రెడ్డి కృషితో..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు

ఎంపీ రఘురాం రెడ్డి కృషితో..భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 3, తెలంగాణ ముచ్చట్లు:

పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్రీయ విద్యాలయం  ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పార్లమెంట్ లో చర్చించి, మంజూరు చేయాల్సిందిగా.. గతంలో కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో..తాజాగా కేంద్రం స్పందించి మంజూరు చేసింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి.. నాలుగు కేటాయించగా.. అందులో ఒకటి భద్రాద్రి జిల్లాకు దక్కింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలప్పుడు.. ఆదివాసీ బిడ్డల విద్యాభివృద్ధి కోసం కేంద్రం చొరవ చూపాల్సిన అవసరం ఉందని.. ఈ మేరకు ముందుకు రావాలని కోరగా చేసిన అభ్యర్థనలు ఫలించాయి. ఎంపీ రఘురాంరెడ్డి చూపిన చొరవ, ప్రత్యేక శ్రద్ధతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరవడం పట్ల.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీ నేతలు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .