మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 టైటిల్ విన్నర్ డాక్టర్ గంగి మల్లేష్

ప్రజా సేవకే అవార్డుల రూపంలో గుర్తింపు

మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 టైటిల్ విన్నర్ డాక్టర్ గంగి మల్లేష్

మేడ్చల్ మల్కాజ్గిరి, సెప్టెంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

సమాజ సేవకే ప్రతిఫలంగా గుర్తింపులు వస్తాయని మరోసారి రుజువైంది. గోల్డెనైర్ అల్ సేవా ఫౌండేషన్, మోర్డ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఫ్యూచర్ గ్లోబల్ సేవ ఫౌండేషన్ – ఇన్ఫాక్ట్ 2025 ఇంటర్నేషనల్ ఫ్యాషన్ & టాలెంట్ అవార్డ్స్లో రాంపల్లి దయారా మాజీ సర్పంచ్ డాక్టర్ గంగి మల్లేష్ “మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ 2025” టైటిల్‌ను అందుకున్నారు.ఈ అవార్డును ప్రముఖులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ శ్రీనివాస్, సినీ నటీమణి రాగిణి, మలబార్ గోల్డ్ మోడల్ & మిస్సెస్ యూనివర్సల్ 2022 డాక్టర్ సుజనా, సినీ నటీమణి హీనా, హైదరాబాద్‌ ట్రాఫిక్ అదనపు డీసీపీ రామదాస్ తేజావత్ తదితరుల చేతుల మీదుగా ప్రదానం చేశారు.ప్రజాసేవే తన లక్ష్యం:
డాక్టర్ గంగి మల్లేష్ మాట్లాడుతూ –
“అవార్డులు అనేవి వ్యక్తిగత కీర్తి కోసం కాకుండా, ప్రజా సేవా మార్గంలో నడిచిన వారికి గుర్తింపుగా వస్తాయి. పేద ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ ముందుకు సాగుతానని” ఆయన అన్నారు.ఇప్పటికే ఆయన భరత్ విభూషణ అవార్డు 2024, స్ఫూర్తి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సేవ చేసే వ్యక్తులను గుర్తించడమే ఈ అవార్డుల ఉద్దేశమని నిర్వాహకులు స్పష్టం చేశారు.
అలుపెరుగని సేవా దృక్పథం
ప్రజల కోసం నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ, అవసరమైన వారికి వైద్య సదుపాయాలు అందించడం, ఎమర్జెన్సీ సమయంలో తన సొంత వాహనాన్నే అంబులెన్స్‌లా ఉపయోగించి రోగులను ఆస్పత్రులకు చేర్చడం వంటి సేవలు డాక్టర్ గంగి మల్లేష్ ప్రత్యేకతగా నిలిచాయి.
పలువురు సామాజికవేత్తలు మాట్లాడుతూ –
“సేవా దృక్పథం అంటే ఇదే. సమాజంలో జరిగే కష్టాలను అర్థం చేసుకొని, నిరుపేదలకు అండగా నిలబడే గంగి మల్లేష్ వంటి వ్యక్తులు నేటి యువతకు ఆదర్శం. ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో అవార్డులు రావాలి” అని అభిలషించారు.WhatsApp Image 2025-09-19 at 7.08.41 PM
ఘనంగా పాల్గొన్న స్వచ్ఛంద సంస్థలుఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కోసం, సమాజాభివృద్ధి కోసం పని చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక సేవకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగి మల్లేష్ సేవలను అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .