యువతకు మంచి అవకాశాలు కల్పించడమే నా ధ్యేయం.

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

యువతకు మంచి అవకాశాలు కల్పించడమే నా ధ్యేయం.

అశ్వారావుపేట, అక్టోబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

అశ్వారావుపేట నియోజకవర్గంలోని ములకలపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, త్వరలోనే అవసరమైన వసతి సదుపాయాలు కల్పించి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

మండలంలో క్రీడా అభివృద్ధి కోసం మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని సంకల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి అనువైన స్థలాన్ని పరిశీలించారు.

విద్యా, క్రీడా రంగాలను సమపాళ్లలో అభివృద్ధి చేసి యువతకు మంచి అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .