తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..

మండల టాస్క్ఫోర్స్ మీటింగ్ ..

తల్లాడ మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

 తల్లాడ మండల పరిషత్ కార్యాలయము నందు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మండల టాస్క్ఫోర్స్ మీటింగ్ జరిగినది ఈ సమావేశము నందు ఆగస్టు 11వ తేదీ నాడు అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు ,జూనియర్ కళాశాలలో మరియు అంగనవాడి కేంద్రాలలో నులిపురుగుల నివారణ మాత్రలు అయినా ఆల్బెండజోల్ మాత్రలను వేయటం జరుగుతుంది వైద్యాధికారి డాక్టర్ కే ప్రత్యూష  తెలియజేశారు.ఆరోజు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత గురించి , చేతులు శుభ్రం చేసుకోవడం గురించి వివరించి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఈ మాత్రలను వేయడం జరుగుతుందని తెలియజేశారు.WhatsApp Image 2025-08-08 at 8.29.08 PM  నులిపురుగులు మాత్రలు వేసుకోవడం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, దానివల్ల విద్యార్థులు చదువులో ముందుంటారని చురుకుదనం ఉంటుందని, అదేవిధంగా వారిలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని తెలియజేసినారు. ఆగస్టు 11వ తేదీ నాడు అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొని ఈ నేషనల్ డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీ కే సురేష్ కుమార్ , ఎంపీడీవో సురేష్ బాబు , హెల్త్ సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ రత్నకుమారి, విద్యా శాఖ శివ  పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .