జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ సునిత రెడ్డి
శాంతి–భద్రతలపై కీలక చర్చలు
వనపర్తి,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా నూతన ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన సునిత రెడ్డి, ఐపీఎస్ మంగళవారం కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి నీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌కు పూలమొక్క అందజేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఇద్దరు ఉన్నతాధికారులు జిల్లా శాంతి భద్రతల పరిణామాలు, నేర నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార చర్యలపై విస్తృతంగా చర్చించారు. రెవెన్యూ–పోలీసు శాఖల పరస్పర సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, ప్రజలకు అందించే సేవల ప్రభావాన్ని వృద్ధి చేయాలని నిర్ణయించారు.జిల్లాలో రోడ్డు ప్రమాదాల తగ్గింపు, యువతలో చట్ట అవగాహన కార్యక్రమాల నిర్వహణ, మహిళల భద్రతను ప్రధాన అంశంగా తీసుకొని ప్రత్యేక చర్యల రూపకల్పనపై ఇద్దరు అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యల పరిష్కారంలో వేగవంతమైన స్పందనకు కట్టుబడి పనిచేస్తాం. జిల్లాలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.. అని నూతన ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు.జిల్లా శాంతి, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పరస్పర సహకారంతో అన్ని విభాగాలు సమగ్రంగా పనిచేయనున్నాయని కలెక్టర్ ఆదర్శ సురభి పేర్కొన్నారు.


Comments