నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం
బిఆర్ఎస్ నాయకులు పానుగంటి సురేష్ కుమార్
వనపర్తి,అక్టోబర్4(తెలంగాణ ముచ్చట్లు):
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, వనపర్తి జిల్లా చిట్యాల సమీపంలోని చేయూత అనాధ ఆశ్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు పానుగంటి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని చిన్నారులకు నోట్‌బుక్‌లు, పెన్నులు అందజేశారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ..పేద పిల్లలకు విద్యా సహాయం అందించడం సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు.అలాగే, బిఆర్‌ఎస్ యువ నాయకుడు పానుగంటి సురేష్ కుమార్ నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సమాజ హితార్థం నాలుగవసారి రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఆశ్రమ నిర్వాహకులు ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు మరియు చిన్నారుల విద్య కోసం అందించిన సహకారం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో విరపాగా సత్యం, గట్టు నాగేష్, పానుగంటి రాజు, గట్టు భాస్కర్ తదితరులు ఉన్నారు..jpeg)


Comments