బేతుపల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం.
Views: 78
On
- పోషకాహారం పై అవగాహన.
- తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువల ఆహార ప్రదర్శన.
సత్తుపల్లి, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
పోషణ మాసం సందర్భంగా బేతుపల్లి గ్రామం అంగన్వాడి కేంద్రంలో గంగారం సెక్టార్ ఆధ్వర్యంలో సిడిపిఓ మెహరీన్ నిషా బేగం సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువల ఆహార పదార్థాల ప్రదర్శన (డెమానిస్ట్రేషన్) నిర్వహించారు.
గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, శిశువులకు అన్నప్రాశనం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించి పోషకాహారం ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో సత్తుపల్లి సిహెచ్ఓ అన్నమ్మ, హెచ్ఎస్ శారా రాణి, విజయకుమారి, సెక్టార్ సూపర్వైజర్ గంగాజలం, ప్రాజెక్టు బీసీ ప్రసాద్, శిరీష, ఏఎన్ఎం సరోజినీ, ఆశా పాపా, తల్లులు, పిల్లలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments