ఈనెల 8 న ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఓహో.. మేఘ మాలా సినీ సంగీత విభావరి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
భక్తరామదాసు కళాక్షేత్రం లో ఈనెల 8 ఆదివారం సాయంత్రం 4:30 ల నుండి... 5.15 వరకు చిన్నారి "వినూత్న & వి.లాస్య" లచే సినీ, పాటల నృత్యప్రదర్శన ఉంటుందని . ఆ తర్వాత సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు స్వర సుధ" మ్యూజిక్ యూనిట్- ఖమ్మం వారి ఆధ్వర్యంలో అమర గాయకులు పద్మ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఘంటసాల పాటల పండుగ ఓహో.. మేఘ మాలా... “అర్ధశత గాన స్వరార్చన" ను ప్రముఖ గాయనీ గాయకులచే సినీ సంగీత విభావరి ఘనంగా నిర్వహిస్తున్నామని అధ్యక్షులు కొమర్రాజు మాధవరావు తెలిపారు . సన్మాన గ్రహితులు ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డా" నాగబత్తిని రవి , రంగస్థల కళాకారులు సినీ నటుడు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎండి జమా . పై సన్మాన కార్యక్రమంలో భాగంగా రంగస్థలం కళాకారులు శ్రీ పొదిల వెంకటేశ్వర్లు చే వారి సతీమణి కీర్తిశేషులు పొదిల వెంకటమ్మ జాపకార్ధకంగా 27 మంది కళాకారులకు మెడల్స్ & షీల్డ్స్ తో సత్కార కార్యక్రమం ఉంటుందన్నారు . ఈ కార్యక్రమంలో ముఖ్యసలహాదారులు "సుజనహిత " శ్రీమతి డా" వనం కృష్ణవేణి , గౌరవ అధ్యక్షులు పారుపల్లి సురేష్ , ఉపాధ్యక్షులు వివి రెడ్డి , కోశాధికారి పి.జె.వినయ్ కుమార్ , వేదిక పర్యవేక్షలు పిన్నెల్లి యాదగిరి , ప్రోగ్రాం కన్వీనర్ కె.వి.రమణా రావు లు పాల్గొన్నారు . కార్యక్రమ వ్యాఖ్యాత గా అఖండ నంది అవార్డు గ్రహీత ఖమ్మం కు చెందిన కళావాచస్పతి శ్రీ జి. రవీందర్ వహిస్తారని అలాగే ఆర్కెస్ట్రా స్వర సుధ” బృందం అని తెలిపారు .


Comments