ఎస్ఆర్‌సీ 6వ వార్షికోత్సవ వేడుకలో పరమేశ్వర్‌రెడ్డి
కాప్రా, తెలంగాణ ముచ్చట్లు:
సైన్టిఫిక్ రీసెర్చ్ కంమ్యూనిటీ 6వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుక ప్రారంభించారు. ఈ సందర్బంగా మందుముల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ- కాంగ్రెస్ యువనాయకులు- సైన్టిఫిక్ రీసెర్చ్ కంమ్యూనిటీ వ్యవస్థాపకులు తన్నీరు శ్రీహరి ఒక్కరుగా ప్రారంభించి కార్పొరేట్ స్థాయిలో సంస్థను అభివృద్ధికి తీసుకొచ్చి 6వ వార్షికోత్సవ వేడుకను నిర్వహించడం అభినందనీయం అని అన్నారు . స్టార్టప్ సంస్థను స్థాపించాలనే నేటి తరం యువతకు శ్రీహరి మార్గదర్శకులు అని అభినందించారు .విద్యావంతులైన యువత ప్రభుత్వ ఉద్యోగాలకై ప్రయత్నిస్తూనే స్టార్టప్ కంపెనీలు , స్వయం ఉపాధి సంస్థలను స్థాపించాలని కోరారు .కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ-
ఎస్ఆర్‌సీ సిఈఓ తన్నీరు శ్రీహరి స్థానిక విద్యావంతులు ఎస్ఆర్‌సీ సంస్థను స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించడం యువతకు స్ఫూర్తిదాయకులని అభినందించారు. తాను ఉపాధి కల్పిస్తూ 70మంది ఉద్యోగుల కుటుంబాలకు బాసటగా నిలవడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విఠల్ నాయక్ , లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బి శివరామ కృష్ణ, కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొబ్బనూరి నాగశేషు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు-ఏ ఎస్ రావ్ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు శ్రీ కొత్త అంజిరెడ్డి,సిపిఎం నాయకులు కురునెల్లి వెంకట్, ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ పటేల్, ఎంపీయుపిఎస్ కాప్రా ప్రధానోపాధ్యాయులు వి రామ్ రెడ్డి అతిథులుగా హాజరై ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమం లో కాప్రా డివిజన్ కాంగ్రెస్ నాయకులు పి పవన్ కుమార్, పడమటి మల్లారెడ్డి,బాబురావు,కొబ్బనూరి నాగరాజు శ్రీధర్ రెడ్డి,సంతోష్ చారి, జి సత్యనారాయణ, తోట కూర శ్రీకాంత్,మూర్తూజా,బాలయ్య, ప్రదీప్ ,అహ్మద్,ఆకుల సంతోష్, మనోజ్ కుమార్, కనకరాజు ,హరి , విజయ్, దయ తదితరులు స్థానిక నాయకులు ఎన్ మహేష్, సత్తయ్య, సత్యనారాయణ, కుమార్, రామకృష్ణ తదితరులు మరియు ఎస్ఆర్‌సీ ఉద్యోగులు పాల్గొన్నారు.


Comments