పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన పాస్టర్ దుబ్బాసి జాషువా
ఖాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు
క్రిస్మస్ పండుగ సందర్భంగా 47 వ డివిజన్ లో పాస్టర్ జాషువా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాషువా మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ మానవాళికి ఏసుక్రీస్తు జన్మ ఒక రక్షణ అని దేవుని మాటలు అక్కర గల వానికి పంచిపెట్టుట కొరకు అనే దేవుని మాటల ద్వారా పేదవారి కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడ0 జరిగిందన్నారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ మాట్లాడుతూ పాస్టర్ దుబ్బాసి జాషువా క్రిస్మస్ పండుగ సందర్భంగా పరిశుద్ధ కార్మికులకు బట్టలు పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన గత 12 సంవత్సరాల నుండి అనేక ప్రాంతాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్ అరికెళ్ల వెంకటస్వామి, చిట్యాల మహేష్, కాలేశ్వరం మునినాథ్, గోల్కొండ రామ, మాతంగి రజిని, విజయ, దుప్పటి శాంత తదితరులు పాల్గొన్నారు.


Comments