జ్యోతిరావు పూలేకు నివాళులు అర్పించడం అంటే జ్ఞానం వైపు ప్రయాణం
ప్రజా సంఘాలు
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ జిల్లా ఖిల వరంగల్ మండలం శంభునిపేటలో మహాత్మ జ్యోతిరావు పూలే 134వ జయంతి సందర్భంగా అఖిల భారత మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేడల ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి వారికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన డాక్టర్ కేడల ప్రసాద్, మహాత్ములకు నివాళులర్పించడం జ్ఞానం వైపు ప్రయాణించడమేనని, పూలే దంపతులు షేక్ ఫాతిమా సహాయంతో మొదటి మహిళా పాఠశాల స్థాపించి సమాజంలోని రుగ్మతలను తొలగించారని పేర్కొన్నారు.
ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ సలీం మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలకు ఉచిత విద్య, వైద్యం అందించడం ద్వారా పూలే దంపతులు యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించారని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గద్దల కుమారస్వామి, ప్రముఖ గాయకుడు లింగాల ఇమ్మానియల్, సీపీయూఎస్‌ఐ పార్టీ కార్యదర్శి గడ్డం శరత్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మేకల సుమన్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మంద రమేష్, కళాకారుడు వల్లందాస్ ఏలీయా, సామాజిక కార్యకర్త డాక్టర్ బాస నరహరి తదితరులు పాల్గొన్నారు.


Comments