పెన్షనర్లు సమాజానికి స్పూర్తి ప్రదాతలు .... 

-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

పెన్షనర్లు సమాజానికి స్పూర్తి ప్రదాతలు .... 

-ప్రతి శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక వైద్య శిబిరం

-జాతీయ పెన్షనర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

ఖమ్మం బ్యూరో ,తెలంగాణ ముచ్చట్లు:

పెన్షనర్లు సమాజానికి స్పూర్తి ప్రదాతలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. 

మంగళవారం జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మా కుటుంబం నాలుగు తరాలుగా ప్రభుత్వం తరపున ప్రజలకు సేవ చేస్తున్నామని, పెన్షనర్లు సమాజానికి స్పూర్తి ప్రదాతలని, కష్టాలు ఉన్నప్పుడు, ఆపద సమయాల్లో  పెద్దలు ఇచ్చే సలహాలతోనే వాటి నుంచి బయట పడతామని తెలిపారు. 

గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది పడిన శ్రమ ఫలితంగా నేడు సమాజానికి ఒక చక్కటి వ్యవస్థ అందుబాటులో ఉందని అన్నారు.  ఒక దరఖాస్తు మా దగ్గరికి వస్తుందంటే అది పరిష్కారమవుతుందని గతంలో అధికారులు చూపించిన నమ్మకం మాత్రమేనని అన్నారు.  నేడు జరుగుతున్న అభివృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా మీరు చేసిన కృషి ఫలితమేనని అన్నారు. 

జిల్లా ఆసుపత్రిలో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్స్ కు వైద్య చికిత్స అందించేందుకు ప్రతి శుక్రవారం ప్రత్యేక విభాగం పని చేస్తుందని, సీనియర్ సిటిజన్స్ కు అవసరమైన ఐదు, ఆరు రకాల ప్రత్యేక వైద్యులు ఒకే చోట అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారని, దీనిని వినియోగించుకోవాలని, ఈ సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ కోరారు.

సీనియర్ సిటిజన్స్ కోసం జిల్లా కలెక్టరేట్ లో ర్యాంప్ పక్కన ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నామని, కలెక్టరేట్ లో
సీనియర్ సిటిజన్స్ కు ఏ శాఖతో పని ఉన్నప్పటికీ ఒకే దగ్గర దరఖాస్తులు తీసుకొని, వాటిని సంబంధిత శాఖలకు కేటాయించి పరిష్కారం అయ్యేలా చూస్తామని, వారం రోజుల వ్యవధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు.

పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసి అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.  పెన్షనర్స్ అనుభవం ఉపయోగించుకునేందుకు ప్రతి నెలా కలెక్టరేట్ లో సీనియర్ సిటిజన్స్ టాక్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ వచ్చి నూతన ఉద్యోగులకు తమ అనుభవాలు అందించాలని కలెక్టర్ కోరారు.WhatsApp Image 2024-12-17 at 9.12.29 PM

ముందుగా పెన్షనర్స్ తమ అభిప్రాయాలను తెలియజేసారు.  అనంతరం జిల్లా కలెక్టర్ పెన్షనర్ లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. కళావతి బాయి, జిల్లా కోశాధికారి ఎస్విఎస్ నర్సింహా, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుబ్బయ్య, సబ్ ట్రెజరీ అధికారి మోదుగు వేలాద్రి , సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు వెలిగేటి చంద్రమోహన్ , జిల్లా ఆరోగ్య అధికారి నారాయణమూర్తి, రిటైర్డ్ ఉద్యోగ సంఘ జిల్లా నాయకులు తాళ్లూరి వేణు , టి.జనార్దన్ , సాంబశివరావు , దుర్గాదేవి , రఘుపతి రెడ్డి , కాజా ముయుద్దీన్ , ఎస్.పూర్ణచందర్రావు , సి.బాబురావు , టి.జగన్మోహన్రావు , ఎం.సత్యనారాయణ , ఎన్.కృష్ణమోహన్ , వి.బాబురావు , ఆర్.వెంకటనారాయణ , రమేష్ , రాధాకృష్ణ , హనుమంతరావు , కృష్ణమూర్తి , ఆదినారాయణ , బసవరావు , బాబురావు , ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .