సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఖిల్లా ఘనపూర్ ఎస్సై నరేష్
Views: 57
On
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖిల్లా ఘనపూర్ ఎస్సై నరేష్ ప్రజలకు సూచించారు. సోమవారం మండలం పరిధిలోని సోలిపూర్ గ్రామంలో ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్సై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ... అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి ఓటిపి, వ్యక్తిగత బ్యాంకు సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితిలో చెప్పవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలు పెరిగి ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాట్సాప్ లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని అన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 కి ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసరమైతే 100 కు డయల్ చేయడం లేదా స్థానిక పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఎస్ఐ నరేష్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments