రైల్వే అలైన్ మెంట్ మార్పు కోరుతూ ఎంపీ రఘురాం రెడ్డికి వినతి

రైల్వే అలైన్ మెంట్ మార్పు కోరుతూ ఎంపీ రఘురాం రెడ్డికి వినతి

ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

కొత్తగా మంజూరైన డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లేన్ అలైన్ మెంట్ మార్పునకు కృషి చేయాలని కోరుతూ.. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డికి ఆయా మండలాల రైతుల తరఫున ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో ఈ రైల్వే లేన్ రానుందని.. విలువైన వ్యవసాయ భూములకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. రైతులకు మేలు జరిగేలా అలైన్ మెంట్ మార్చాలని కోరారు. సమస్యను పూర్తిగా విన్న ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. తప్పకుండా రైల్వే జీఎం, కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అభయమిచ్చారు.

ఈ కార్యక్రమం లో తిరుమలాయపాలెం కాంగ్రెస్ మండల అధ్యక్షులు బెల్లం శ్రీను, నాయకులు కొప్పుల చంద్రశేఖర్, సాదిక్, పోట్ల యోగేందర్, ఉప్పల్ రావు, పుచ్చకాయల సుధాకర్, రాము తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .