పారిశుద్య కార్మికుల, అంగన్వాడి కేంద్రాల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం

-- ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వీరపాగ రామకృష్ణ 

పారిశుద్య కార్మికుల, అంగన్వాడి కేంద్రాల సమస్యలపై జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

వనపర్తి జిల్లాలో పారిశుద్ధ కార్మికుల, అంగన్వాడి కేంద్రాల సమస్యలపై సోమవారం ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వీరుపాక కరుణాకర్ జిల్లా అదన కలెక్టర్ సంచిత్ గంగ్వార్ గారికి వినతి పత్రం అందజేశారు.వనపర్తి జిల్లాలో ఉన్న వివిధ గ్రామాలలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల జీతభత్యాలు ప్రభుత్వం సకాలంలో అందించాలని, జీతాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డు మీద పడిన దుస్థితి అత్యంత బాధాకరమని వారి కుటుంబాలు కూడా గొడవలేని స్థితి వారిది వారు గ్రామాలకు చేస్తున్న సేవ వర్ణనాతితం అని గుర్తు చేస్తే ప్రభుత్వం వెంటనే వారికి జీతభత్యాలు ఇవ్వాలని ధర్మసమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.అలాగే జిల్లాలో కొన్ని గ్రామాల్లో కనీస అంగన్వాడి కేంద్రాలు లేకపోవడం వల్ల అంగన్వాడి టీచర్స్ ఆయాలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ యొక్క అంశాలపై ప్రభుత్వం త్వరగా దృష్టి సాధించి ఈ సమస్యలను పరిష్కరించాలని తెలియజేస్తూ ఆ పార్టీ నాయకులు అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్, బలరాం, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .