ప్రజా ప్రభుత్వం లోనైనా సహకరించండి సారు.. 

70 ఏళ్లుగా గ్రామానికి సర్పంచ్ గా ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తలేరు 

ప్రజా ప్రభుత్వం లోనైనా సహకరించండి సారు.. 

-- దళిత నాయకులు డిఎస్ మహేష్ 

వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ పంచాయతీ లో సర్పంచ్ గా ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తలేరని గ్రామంలోని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో నైన వెల్టూర్ గ్రామానికి సర్పంచ్ గా దళితులకు రిజర్వేషన్ కల్పించాలని సోమవారం గ్రామానికి చెందిన దళిత జిల్లా నాయకుడు డి ఎస్ మహేష్ ఆధ్వర్యంలో పెద్దమందడి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 1954వ సంవత్సరం నుండి నేటి వరకు 70 సంత్సరాలు ఎస్సి రిజర్వేషన్ కల్పించడం లేదని ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వెల్టూర్ గ్రామ పంచాయతీకి 2025 సంవత్సరంలో జరగబోయే స్థానిక ఎన్నికలలో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
 వెల్టూరు గ్రామపంచాయతీలో  దాదాపు 100 కుటుంబాలు 500 ఓటర్ల జాబితా కలిగిన ఎస్సీలకు 1954 నుండి నేటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలిచేందుకు ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం అన్యామని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గుర్తించి వెల్టూరు గ్రామ పంచాయతీకి పంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలలో భాగంగా రిజర్వేషన్ అనేది రొటేషన్ రాజ్యాంగం ప్రకారం 25 సంత్సరాలకు ఒకసారి మార్పు జరగాలి. కానీ 70 సంత్సరాల నుండి ఒకసారి కూడా ఎస్ సి లకు రిజర్వేషన్ జరగలేదు. ఒక గ్రామంలో రెండు కుటుంబాలు ఉన్న రిజర్వేషన్ అనేది ఇవ్వాలి కానీ దాదాపు 100 కుటుంబాలు అంటే 500 ఓటర్లు జనాభా కలిగిన ఎస్సీలు వెల్టూరు గ్రామ పంచాయతీలో ఉన్నారు. అయినా కూడా కొంతమంది ఆనాటి ఉమ్మడి జిల్లా మండల అధికారుల స్వార్థంతో కొంతమంది రాజకీయ నాయకుల ఓత్తిడితో రిజర్వేషన్లు చేయకుండా ఎక్కువగా జనరల్ లేదా బీసీ రిజర్వేషన్ చేస్తున్నారని వారు తెలిపారు. 2025 సంస్థగత ఎన్నికలలో ఎస్సీ జనరల్ కు అవకాశం కల్పించే విధంగా కృషి చేయాలని వారు వేడుకున్నారు. ఇదివరకు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే నేడు పెద్దమందడి మండల తాసిల్దార్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర కమిషన్ కు వినతిపత్రం అందజేయడం జరుగుతుందని వారు పత్రిక ముకంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో  డిఎస్ మహేష్, గుండెల ఆంజనేయులు, ఎర్పుల రాములు, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .