వినాయక విగ్రహాలు ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి

పోలీసు నిబంధనలు పాటిస్తూ భక్తి శ్రద్దలతో గణేష్  ఉత్సవాలు జరుపుకోవాలి

వినాయక విగ్రహాలు ఏర్పాటుకు పోలీసు అనుమతి తప్పనిసరి

 జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ 

వనపర్తి,ఆగస్టు20 (తెలంగాణ ముచ్చట్లు):

ఈ నెల 27న బుధవారం నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా పరిధిలో మండపాలలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు జరుపుకోవాలనుకునేవారు తప్పనిసరిగా పోలీసుశాఖ నుండి అనుమతి పొందాలని, ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఏర్పాటు కు సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్ ద్వారా అందించాలని  వనపర్తి జిల్లా ఎస్పీ రావుల  గిరిధర్ తెలిపారు. ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యులు పేర్లు వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు,  నిమజ్జనం చేసే తేదీ సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. వనపర్తి జిల్లాలోని పట్టణాలలో మరియు గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాలు కాని సందర్భంలో దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ ను సంప్రదించాలని సూచించారు.గణేష్ మండపాల నిర్వహకులకు పోలీసు వారి సూచనలు పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలని   ఎస్పీ  తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై  ప్రతిష్టించరాదు. మరియు ఎట్టి పరిస్థితులలోను జనజీవనానికి అంతరాయం కలిగించరాదు.గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాల పార్కింగ్ కొరకు తగినంత దూరంలో,  నిర్దేశించిన ప్రదేశాలలో పార్కింగ్ చేసుకొనె విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి.గణేష్ మండప నిర్వాహకులు విద్యుత్ సరఫరాకై విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి మరియు భారీ వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, నాణ్యతతో కూడిన మండప నిర్మాణం చేపట్టాలన్నారు.మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి.  ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాట్లకు అనుమతి లేదు. ఎవరైనా లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.గణేష్ మండపాలను జాగ్రత్తగా చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి.గణేష్ మండపాల వద్ద టపాకాయలను, మందుగుండు సామాగ్రిని ఉంచరాదు, మండపాల వద్ద కరెంట్ పోయినా, ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ల్యాంప్ అందుబాటులో ఉంచుకోవాలి.మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి.టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు.గణేష్ మండపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.గణేష్ మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలి.    రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి వచ్చే పోలీస్ అధికారికి మంటప వలంటీర్లు సహకరించాలి. గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు,ఇసుక ఏర్పాటు చేసుకోవాలి.అత్యవసర సమయంలో, ఏదైనా సమాచారం ఉన్నా డయల్ 100 కు గాని, సంబంధిత పోలీ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలి.ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద శబ్దాలతో కూడిన లౌడ్ స్పీకర్స్, డి.జె. లకు అనుమతి లేదని అన్నారు. ఎవరైన డి.జె. ఏర్పాటు చేస్తే మండప నిర్వాహకులపై, డి.జె యాజమానులపై చట్ట రిత్యా  చర్యలు తీసుకుంటామని ఎస్పీ  అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .