ఆరెంపులలో ఆనందోత్సవం… పొంగులేటి క్రీమ్ కలర్ కుర్తా పైజామా ప్రత్యేక ఆకర్షణ!
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 24, తెలంగాణ ముచ్చట్లు;
ఆరెంపుల గ్రామం బుధవారం పండుగ వాతావరణంలో కళకళలాడింది. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గుమ్మాల వద్ద పూలతోరణాలు... ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు... గృహాల చుట్టూ వినిపించిన మంగళధ్వానాలు కొత్త జీవితానికి సంకేతాలు వెలిగించాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామంలో గృహప్రవేశాలు ఘనంగా జరగగా... ముఖ్య అతిథిగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాకతో ఉత్సవం మరింత ఉప్పొంగింది.
ఈ వేడుకలో మంత్రి పొంగులేటి వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా అందరి చూపులను కట్టిపడేసింది. ఆయన ధరించిన క్రీమ్ కలర్ కుర్తా పైజామా అందరి దృష్టిని తనవైపు తిప్పేసింది. గ్రామస్తులు "పొంగులేటి శీనన్న సాదాసీదా స్టైల్ ఎంత బాగుందో!" అంటూ చర్చించుకున్నారు. కొత్తగా గృహ ప్రవేశం చేసుకున్న వారందరికీ మంత్రి పొంగులేటి అభినందనలు తెలిపి... పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు.


Comments