శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 20, తెలంగాణ ముచ్చట్లు;

బతుకమ్మ పండుగ పురస్కరించుకుని శ్రీ కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థినులు పూలతో బతుకమ్మ పేర్చి ఆడిపాడారు. ఆటపాటలతో పాఠశాల  కోలాహలంగా మారాయి.ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్ పర్సన్ నిష్టాశర్మ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, నేటి తరం యువతకు బతుకమ్మ గురించి తెలుపవలిసిన అవసరం మనందరిపైన ఉన్నదని తెలిపారు. దసరా, బతుకమ్మల ప్రాముఖ్యతను విద్యార్థులకు  వివరించారు. అనంతరం విద్యార్థినులు సంప్రదాయక బట్టలు ధరించి, వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మలను ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమంలోస్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .