ఎస్ ఆర్ సి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు
స్వర్ణరాజ్ శివమణి, విట్టల్ నాయక్
Views: 36
On
కాప్రా, డిసెంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఎస్ ఆర్ సి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ సీఈఓ ఈకో తనీరు శ్రీహరి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మారియో,మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.వేడుకల్లో పాల్గొన్న అతిథులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పండుగ వేడుకలు సమాజంలో ఐక్యత, సౌహార్దాన్ని పెంపొందించడం లో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ సి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాము, పవన్, మనోజ్, సంతోష్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments