దీపావళి బాణాసంచా షాపుల కోసం ముందస్తు అనుమతి తప్పనిసరి.
- అనుమతి లేకుండా షాపులు ఏర్పాటు చేయరాదు.
- దమ్మపేట పోలీసులు కఠిన చర్యలు హెచ్చరించారు.
దమ్మపేట, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు ముందుగా అనుమతి పొందవలసిందిగా దమ్మపేట పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
దమ్మపేట ఎస్‌ఐ సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, టపాకాయల వ్యాపారులు పాల్వంచ సబ్‌డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలి. అనుమతి లేకుండా షాపులు ఏర్పాటు చేసిన వారిపై స్వేదయుధ్ధాల చట్టం–1884 మరియు నియమాలు–1933 (సవరణ 2008) ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.
పోలీసుల సూచనల ప్రకారం, షాపులు ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలి. ఒక సమూహంలో 50 షాపులకంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, కళ్యాణ మండపాలు, సమావేశ కేంద్రాల్లో షాపులు ఏర్పాటు చేయరాదు.


Comments