ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడండి, ప్రభుత్వ భూములను పరిరక్షించి, 

ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించండి

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడండి, ప్రభుత్వ భూములను పరిరక్షించి, 

జిల్లా కలెక్టర్ మను చౌదరి కి వినతి

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 

మల్కాజ్గిరి, తెలంగాణ ముచ్చట్లు:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ని అంతాయిపల్లి లోని కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  

 మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల, ప్రభుత్వభూముల పరిరక్షణ, మరియు ప్రజా అవసరాలకు అనుగుణంగా భూముల కేటాయింపులు వంటి పలు విషయాలను కలెక్టర్  దృష్టికి తీసుకెళ్లి , సంబంధిత కాలనీ, బస్తీ వాసులు నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రభుత్వ భూములు  కబ్జాలకు గురవుతున్నాయని, కబ్జాల నుంచి కాపాడి ప్రజా ఉపయోగ పడే విధంగా అర్బన్  ప్రైమరీ హెల్త్ సెంటర్లుకు కేటాయించా లని  మల్కాజ్గిరి నియోజక వర్గంలో ఆరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు, లైబ్రరీలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం నిధులు ఉన్నాయి, ప్రభుత్వ భూములు కేటాయిస్తే జిహెచ్ఎంసి ద్వారా యూపీహెచ్ సీ లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారని  


మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లకు కోసం భూములు కేటాయించా లని నియోజకవర్గంలోని  ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించడం జరిగిందని ఆ ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకొని మల్టీపర్పస్కు కేటాయిస్తే జిహెచ్ఎంసి ద్వారా నిర్మించుకోవడానికి వీలవుతుందని 

ముస్లిం, క్రిస్టియన్లకు స్మశాన వాటికల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని తెలిపారు.ఇటీవల జరిగిన దిశ మీటింగ్ లో గతంలో జరిగిన దిశ మీటింగ్ లో పేర్కొన్న అంశాలను పరిగణలకు తీసుకొని వాజ్ పాయ్ నగర్ లో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజ్ , డిగ్రీ కాలేజ్ లో ఉన్న పరిస్థితులను వివరించినప్పు డు అర్థం చేసుకొని సందర్శించి వెంటనే రెండున్నర కోట్ల నిధులను కేటాయించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
అలాగే అదనపు తరగతి గదులు నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు , 

మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్  సందర్శించి మెరుగైన వసతులకు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని మల్కాజ్గిరి లో అత్యధికంగా బ్రాహ్మణ కులస్తులు ఉండడంతో వారు కర్మకాండలు చేసుకోవాలను కున్న పెళ్లిలు చేసుకోవాలను కున్న, పేద బ్రాహ్మణులకు అవసరాలకు వాడుకునే విధంగా బ్రాహ్మణ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. 

 జీవో 58, 59 ద్వారా దరఖాస్తు చేసుకున్న పేదలను గుర్తించి అవకతవకలు జరగకుండా పరిశీలించి జీవో 59 ద్వారా డబ్బులు చెల్లించిన వారికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేయాలని, 

 ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని కాపాడాలని  గతంలో ఇచ్చిన దరఖాస్తులకు చర్యలు చేపట్టడం జరిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా  స్పందన లభించడం జరిగింది అక్కడినుంచి యాక్షన్ టేకెన్ రిపోర్ట్  పంపించాలని కలెక్టర్ ని కోరడం జరిగింది.

 కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలు ,  సర్వేనెంబర్ 844 హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ల మధ్య,  మల్కాజ్గిరి మారేడుపల్లి మండలాలు భౌగోళిక సరిహద్దులు సూచించకపోవడంతో దాదాపు 55 ఎకరాల స్థలం కబ్జాలకు గురి అవుతున్నాయని అలాంటి స్థలంలో నవోదయ స్కూల్లో  ఏర్పాటు చేసే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని , ఎ.డి. సర్వే చేయించాలని.
 
ఇటీవల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మంత్రి డి. శ్రీధర్ బాబు ని కలిసి  సబ్ రిజిస్టర్ ఆఫీస్, డిగ్రీ కాలేజ్ స్థలం కేటాయించాలని కోరగా కలెక్టర్ ని ఆదేశిస్తూ రాసిన లేఖలను అందజేయడం జరిగింది .

సర్వే నెంబర్ 844 హిల్ టాప్ కాలనీలో ప్రభుత్వ భవనమును అంగన్వాడీ సెంటర్ కు లేదా మహిళా భవన్ కేటాయించాలని . సర్వేనెంబర్ 278 టెలికం కాలనీ వినోబా నగర్ లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని అదేవిధంగా యాప్రాల్ సర్వేనెంబర్ 171 లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ల నిర్మించాలని

సర్వేనెంబర్ 582 మరియు 583 ప్రభుత్వ స్థలాన్ని కబ్జాలకు గురికాకుండా పరిరక్షించాలని. అల్వాల్ జొన్న బండ ప్రాంతంలో సర్వేనెంబర్ 22 , 23లో ప్రజల కొనుక్కున్న ఫ్లాట్లను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులు రాక్ ల్యాండ్ ఎవెన్యూ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని స్థలాన్ని పరిరక్షించి అక్కడ నూతన భవనాలకు అనుమతులు ఇవ్వకూడదని.

మౌలాలి ప్రాంతంలో  వోక్స్ బోర్డ్  భూములలో రిజిస్ట్రేషన్స్ జరిగేలా కృషి చేయాలని. పేద మహిళలకు ఉపాధి కల్పన కొరకు కుట్టుమిషన్లు అందజేయాలని . పై విషయాలను ఎమ్మెల్యే  వినతి పత్రాలను అందజేస్తూ కలెక్టర్ కి సవివరంగా వివరించారు. అందుకుగాను కలెక్టర్  సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి తోడ్పడుతానని తెలియజేశారు. 


WhatsApp Image 2025-07-30 at 9.29.46 PMఈ యొక్క కార్యక్రమంలో  బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, మేకల సునీత రాము యాదవ్, తోట నరేందర్ రెడ్డి,డోలి రమేష్, చిన్న యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి,లక్ష్మణ్ యాదవ్, హేమంత్ పటేల్,యాదగిరి గౌడ్, రాజశేఖర్ రెడ్డి, రాజు, విజయ్ శేఖర్, జనార్ధన్, అరవింద్, అరుణ్, విజయ్, ఉష శ్రీ, సూర్యకుమారి, పర్వీన్  వివిధ కాలనీ ,బస్తీ వాసులు, కుల సంఘాల నాయకులు, మహిళలు కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .