రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలి... 

అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలి... 

ఖమ్మం బ్యూరో, నవంబర్- 11, తెలంగాణ ముచ్చట్లు;

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పత్తి, ధాన్య కొనుగోళ్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం తల్లాడ, కల్లూరు మండలాల్లో అదనపు కలెక్టర్ పర్యటించి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, ధాన్య కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, తల్లాడ మండల కేంద్రంలో సిసిఐ చే ఏర్పాటుచేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. పత్తి కొనుగోళ్లను పరిశీలించి, ట్యాబ్ ఎంట్రీ, పంట నమోదులను తనిఖీ చేశారు. కొనుగోలుకు వచ్చిన పత్తిని తేమ యంత్రంతో తేమ శాతం పరిశీలన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు రైతులకు సహకరించి, కొనుగోలు ప్రక్రియ సజావుగా చేపట్టాలన్నారు.  తల్లాడ లోని వెంకట పద్మావతి రైస్ మిల్ ను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం దిగుమతి, ట్రక్ షీట్ల నమోదుకు పరిశీలించారు.WhatsApp Image 2025-11-11 at 8.29.14 PMకొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్నివెంట వెంటనే అన్లోడ్ చేసుకోవాలని మిల్లర్ కు సూచించారు. అదనపు కలెక్టర్ తన పర్యటనలో తల్లాడ మండలంలోని నూతనకల్, రంగంబంజర, కల్లూరు మండలంలోని లింగాల, పుల్లయ్య బంజర గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రోజుకు ఎంతమేర ధాన్యం కేంద్రాలకు వస్తున్నది, ఎంతమేర రవాణా చేస్తున్నది, రైతులకు కల్పిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు. రైతులతో మాట్లాడి, కొనుగోళ్లలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం చూసుకొని కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొని రావాలని రైతులను కోరారు. అధికారులు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ వెంట వెంటనే చేపట్టాలని, రైతులకు వారి ధాన్య మొత్తం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదనపు కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా సహకార అధికారి గంగాధర్, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీలత, అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .