వెల్టూర్ లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

వెల్టూర్ లో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు: 

పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం వెల్టూర్ పంచాయతీ కార్యదర్శి, వెల్టూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి స్వచ్ఛత హి సేవ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాల నుండి గ్రామంలో వీధి వీధినా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత హి సేవ 2024 పేరుతో గ్రామంలోని ప్రజలకు పారిశుద్యం , వ్యర్థాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు పరిశుభ్రత కోసం వ్యక్తిగత బాధ్యత వహించాలని , పరిశుభ్రమైన ,స్థిరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు విష్ణు, ఉపాధ్యాయులు వెంకట్ నారాయణ, శ్రీనివాసులు, రమేష్, శేఖరా చారి, మునురుద్దీన్, మల్లయ్య, దేవేందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, ఆశ వర్కర్లు బండి సుగుణ, కాజమ్మ, మమత ,వసంత, అంగన్వాడి టీచర్ పుష్పలత, బుక్ కీపర్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .