శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా క్విజ్,వేషధారణ పోటీలు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా క్విజ్,వేషధారణ పోటీలు.

సత్తుపల్లి, తెలంగాణ ముచ్చట్లు:

శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదిన సందర్భంగా స్థానిక జవహర్ నగర్ లోని రుక్మిణీ సత్యభామా సమేత కృష్ణాలయంలో శనివారం విద్యార్థులకు క్విజ్, శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించారు. శ్రీ కృష్ణుని జీవిత చరిత్రపై జరిగిన క్విజ్ లో ప్రధమ, ద్వితీయ,  తృతీయ బహుమతులను టాలెంట్ స్కూల్, విశ్వశాంతి విద్యాలయం, జిల్లా పరిషత్ ఎన్టీఆర్ నగర్ ఉన్నత పాఠశాల గెలుచుకున్నారు. శ్రీ కృష్ణ వేషధారణలో చిన్నారులు విలాసకవి నిహిర, జి.జోవిత, బి.భవిష్య ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందచేశారు. 

విజేతలకు సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ బహుమతులు అందచేశారు. విశ్వశాంతి విద్యాలయం విద్యార్థుల కోలాట ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులను అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, IMG-20250816-WA0064చల్లగుళ్ళ నరసింహారావు, తోట సుజలరాణి, ఆలయ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .