రాజోలి–శాంతినగర్ రహదారి చెరువుగా మారిన వైనం

అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం

రాజోలి–శాంతినగర్ రహదారి చెరువుగా మారిన వైనం

జోగులాంబ గద్వాల్,సెప్టెంబర్ 26 (తెలంగాణ ముచ్చట్లు):

రాజోలి మండల కేంద్రం నుండి శాంతినగర్ వైపు వెళ్లే రహదారి వర్షపు నీటితో గుంతలు నిండిపోయి చెరువులా మారింది. ఈ రహదారిని ఉపయోగించే గ్రామస్తులు, రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రహదారి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లల స్కూల్ బస్సులు కూడా సరిగా నడవలేక ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయి.WhatsApp Image 2025-09-26 at 7.41.42 PM

“ఎటు వెళ్లాలో అర్థం కాక ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తోంది. బస్సులు, ఆటోలు సరిగా నడవట్లేదు,” అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తుంగభద్ర నది ప్రవాహం, రాజోలి రిజర్వాయర్ కారణంగా వర్షాకాలంలో రహదారులు మరింత దెబ్బతింటున్నాయని ప్రజలు చెబుతున్నారు. తక్షణం చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .