రాపాకపల్లి ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

గ్రామ శాఖ అధ్యక్షులుగా  పులిపాక చిరంజీవి 

రాపాకపల్లి ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

 ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని రాపాకపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సోంపెల్లి అన్వేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈ నూతన గ్రామ కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగారపు శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి పాల్గొని మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు.వారు మాట్లాడుతూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని  తీర్పు ఇచ్చిన అర్ధగంట లోపే  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మా కాంగ్రెస్  ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎస్సీ వర్గీకరణను తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాం అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్లను కూడా నిలిపివేసి వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని అన్నారని,ఈ యొక్క దేశంలోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి నేనే అని పేరు తెచ్చుకుంటానని చెప్పి మోసం చేసి వర్గీకరణ ను అమలు చేయకుండానే   ఉద్యోగాలను విడుదల చేయడం జరిగిందని,అందుకు నిరసనగా మందకృష్ణ మాదిగ డిసెంబర్ 21న హైదరాబాదులో ధర్మ యుద్ధ మహాసభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆ యొక్క సభకు మాదిగలంత పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను సాధించుకోవాలని అన్నారు.అనంతరం సింగారపు పవన్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు,చిలుక రాజు ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి  ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగినది. గ్రామ శాఖ అధ్యక్షులుగా  పులిపాక చిరంజీవి ,అధికార ప్రతినిధి  వస్కుల సన్నీ ,ఉపాధ్యక్షులు కందుకూరి శ్రావణ్ ,ఉపాధ్యక్షులు ఇమ్మడి బాబు, ప్రధాన కార్యదర్శి కందుకూరి జోసెఫ్, ప్రచార కార్యదర్శి తప్పట్ల మధుకర్,సహాయ కార్యదర్శి కందుకూరి బాలు,కార్యదర్శి కందుకూరి పవన్,కమిటీ మెంబర్స్ ఉమ్మడి మొగిలి కందుకూరి శ్రీనివాస్ కందుకూరి బాబు, ఏం శామ్,ఎస్ ఏలియా,వీ స్వామి,కె పవన్,కే బాబు,కే ద్భుతరావు,ఈ విశ్వనాథం తదితరులను ఎన్నుకున్నారు.
 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .