రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
Views: 25
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శనివారం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తవడానికి సమష్టి సహకారం అవసరమని గ్రామస్తులకు సూచించారు.ఆలయ నిర్మాణం కోసం అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రేణుక ఎల్లమ్మ ఆలయం గ్రామం కేంద్రంగా పూజలు, ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తుందని, ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..jpeg)
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments