వసతిగృహాల పరిస్థితులపై రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుల సమీక్ష
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రభుత్వ వసతిగృహాలలోని పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు విశ్వేశ్వరరావు హనుమకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశమై, వసతిగృహాల శుభ్రత, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయం, వంటసౌకర్యాల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు.
అధిక వసతి గృహాల్లో కట్టెల పొయ్యులను వాడుతున్నందున ప్రత్యేక వంటగదులు ఏర్పాటు చేసి, వంట గ్యాస్ సదుపాయం కల్పించాల్సిన అవసరాన్ని అధికారులు వివరించారు. వసతిగృహాల ఫుడ్ కమిటీల్లో విద్యార్థులను సభ్యులుగా నియమించడం వంటి సూచనలు చర్చించబడ్డాయి.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, విద్యాశాఖ అధికారి వాసంతి, బీసీ సంక్షేమ అధికారి రామిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్ రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి ప్రేమకళ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments