నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఆర్జేసి కృష్ణ
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
వరద బాదితుల కు అమెరికా కు చెందిన ఆప్టా సంస్థ ఆర్జేసి కృష్ణ ఆధ్వర్యం లో సమకూర్చిన 300 మందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలనుఆదివారం కృష్ణ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోఎన్నడూలేని విధంగా ఇటీవల వరదలు వచ్చాయని, దీనివల్ల అనేక మంది ప్రజలు సర్వస్వం కోల్పోయారని తెలిపారు.వీరికి అండగా నిలిచేందుకే నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు.అమెరికా లో ఉంటున్న తెలుగు వారు ఆఫ్టా సంస్థ గా ఏర్పడి సహాయం చేయడం అభినందనీయం అన్నారు.ఆఫ్టా సంస్థ ప్రెసిడెంట్ ముద్రగడ త్రినాధ్, గ్లోబల్ ఆపరేషన్స్ బాద్యులు వుల్లి మధు, గుండాల కార్తీక్ లకు ఖమ్మం ప్రజల తరుపున కృతఙ్ఞతలు తెలిపారు.కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు తోట రామారావు,కనకం భద్రయ్య, మాటేటి నాగేశ్వర రావు,కన్నం ప్రసన్న కృష్ణ, ఎం. వెంకటేశ్వరరావు ,గుండాల అప్పారావు ,గుండాల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.


Comments