అన్న దానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్జేసి కృష్ణ
Views: 4
On
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
స్థానిక 46వ డివిజన్ లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎస్.బి. ఐ.టి., ఆర్జేసి విద్యా సంస్థల అధినేత గుండాల కృష్ణ ప్రారంభించారు. అదేవిధంగా మండపం లో వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడు అందరి విఘ్నాలు తొలగించి కరుణా కటాక్షాలు కురిపిం చాలని, ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని వినాయకుని కోరినట్లు తెలిపారు.ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న కమిటీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తోట రామారావు ,కనకం భద్రయ్య, కమిటీ సభ్యులు అంజీ, కిషోర్ , అరవింద్, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments