ఫార్ములా-ఇ వివాదంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు 

కేటీఆర్ పై అవినీతికి సంబంధించి ఏసీబీ కేసులో అర్ఎస్  కీలక వ్యాఖ్యలు

ఫార్ములా-ఇ వివాదంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు 

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్  14/2024 లో  మాజీ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పై అవినీతితో సంబంధిత ఆరోపణలను రిటైర్డ్ అడిషనల్ డీజీ అర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుత పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చే ఇచ్చిన ఫిర్యాదులో, 55 కోట్ల రూపాయల నుంచి ఒక్క పైసా కూడా కేటీఆర్ జేబుల్లోకి వెళ్లినట్టు నిరూపించలేకపోయారని ఆయన తెలిపారు. ఆరు నెలలపాటు శ్రమించి కూడా ఈ అంశంపై సరైన ఆధారాలు తీసుకురాలేకపోయారని పేర్కొన్నారు.

ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ‘ప్రొసీజర్ వయోలేషన్స్’ మాత్రమే ఆధారంగా కేసు నమోదు చేశారని, దీనిపై శాఖాపరమైన విచారణ జరిపి నిజాలు తేల్చుకోవచ్చు. సచివాలయంలో ఇదే తరహా ప్రొసీజర్ వయోలేషన్స్ ప్రతీ డిపార్ట్మెంట్‌లో రోజూ జరుగుతాయని, వీటిని క్రమబద్ధీకరించడం అవసరమని చెప్పారు.అలాగే, ఆయన రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగితే, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్లనే జరిగినట్లుగా పేర్కొన్నారు. ఫార్ములా-ఇ అగ్రిమెంట్ రద్దు విషయంలో రేవంత్ రెడ్డి, నిపుణుల కమిటీతో చర్చలు జరపకుండా, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకున్నందున తెలంగాణకు వచ్చేది వందల కోట్ల రాబడిని గాల్లో చరిపించింది అని ఆయన ఆరోపించారు.ఈ వివాదంలో కేటీఆర్ కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా బాధ్యత వహించే వారేనని, ఫార్ములా-ఇ కేసులో ఆయన ఏ-1 గా నిలవడం తప్పని సరి అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.ఇంతకు ముందు అనేక ఆర్థిక నేరాలపై పరిశోధనలు చేసిన ప్రవీణ్ కుమార్, ఈ కేసులోనూ ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగకుండా తీసుకునే చర్యలు సరైనవేనని, రేవంత్ రెడ్డి నియంత్రణలో ఉండే నిర్ణయాలు తెలంగాణకు ఎంతగా దెబ్బతినే అవకాశం ఉందో స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .