హన్మంతాపూర్‌లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించిన ఆర్టీఏ సభ్యుడు చిలివేరు అభిగౌడ్
Views: 24
On
జనగామ .న్నర్మేట్ట మండలం హన్మంతాపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని ఆర్టీఏ సభ్యుడు చిలివేరు అభిగౌడ్ దర్శించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, గ్రామ గౌడ సంఘం ఆహ్వానం పై ఆలయానికి విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆలయానికి పది వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో గౌడ కులస్థులు అభివృద్ధి చెందాలని, వర్షాలు సకాలంలో పడి పంటలు పండాలని కోరుకున్నారు. అనంతరం గౌడ సంఘం సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గౌడ సంఘం సభ్యులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments