జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సాదిక్ అహ్మద్ నియామకం
ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 23, తెలంగాణ ముచ్చట్లు;
జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఖమ్మం పట్టణానికి చెందిన సాదిక్ అహ్మద్ నియమితులయ్యారు. ఈ నియామకంతో సంస్థ సభ్యులు, కార్యకర్తలు, వివిధ మతపరమైన పండితులు హర్షం వ్యక్తం చేశారు.
గతంలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన సాదిక్ అహ్మద్, పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి, సంస్థ అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించారు. ఆయన క్రమశిక్షణ, సేవాభావం, సమాజ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడిగా సహచరుల ప్రశంసలు అందుకున్నారు.
తన నియామకంపై స్పందించిన సాదిక్ అహ్మద్ మాట్లాడుతూ, “సంస్థ ఇచ్చిన ఈ బాధ్యతను నిజాయితీతో నిర్వర్తించి, సమాజానికి మరింత సేవ చేయడానికి కృషి చేస్తాను. జమాతే ఇస్లామీ హింద్ లక్ష్యాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరవేసి, శాంతి, సహనం, సేవా భావాలను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంటాను” అని తెలిపారు. ఇదే సమయంలో పలు మతపరమైన పండితులు ఆయన నియామకాన్ని స్వాగతిస్తూ, రాష్ట్రంలో సామాజిక, విద్యా, మానవతా రంగాల్లో జమాతే ఇస్లామీ హింద్ కార్యకలాపాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.


Comments