బంజారాల కారణజన్ముడు ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

బంజారాల కారణజన్ముడు ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్

భద్రాచలంలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలు
ఆయన ఆశ సాధన కోసం గిరి బిడ్డలు కృషి చేయాలి 

ఆర్డీవో దామోదర రావు 

WhatsApp Image 2025-02-15 at 8.24.17 PM (1)భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

   ఎందరో మహానీయులు పుట్టిన గడ్డ మన భారతదేశం అని దాంట్లో కారణ జనుముడు,
 బంజారా జాతి ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జాతిని ఒకే తాటిపై నడిపించిన మహనీయుడు సేవలాల్ మహారాజ్ అడుగుజాడలో నడిచి ఆయన ఆశయ సాధనం కోసం ప్రతి గిరిజన బిడ్డ కృషి చేయాలని, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు అన్నారు.
శనివారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరిజన భవనంలో ఏర్పాటుచేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం భద్రాచలం ఆధ్వర్యంలో భోగ బండారో కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి బంజారా కమిటీ సభ్యులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్యక్రమానికి వచ్చిన ఆర్డీవో  మరియు ముఖ్య అతిథులకు కమిటీ సభ్యులు బంజారా సాంప్రదాయపరకారం ఘనంగా స్వాగతం పలికారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి, భోగ్ బండారో, వింతీ కార్యక్రమం బంజారా సోదరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసిన అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ జాతీ ఐక్యత కోసం అందరం పాటుపడాలని, పిలుపునిచ్చారు. లంబాడీలు దేవుడిగా భావించి 
 సంతసేవాలాలును కొలుస్తారని,  సేవాలాల్ జంతుబలికి తీవ్ర వ్యతిరేకి అని,తల్లిదండ్రులను మహిళలను గౌరవించాలని ప్రజలకు ఆయన బోధించారు. ప్రకృతిని వన్యప్రాణులను పరిరక్షించడం ద్వారా మానవజన్మ సార్థకత చేకూర్చుకోవాలని సూచించేవారని,ఒక సంఘసంస్కర్త, ప్రకృతి ప్రేమికుడు ఆధ్యాత్మిక గురువు, బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడు, జాతి ఉద్దారకుడు, భారతదేశంలో 10 కోట్ల కు పైచిలుకు జనాభా కలిగిన బంజారాలు ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతిని జరుపుకుంటున్నారని అన్నారు.
          చత్రపతి శివాజీ, గురునానక్ ,గౌతమ బుద్ధుడి లాంటి మహనీయులు ప్రజల జీవన విధానం  కొరకు ఏ విధంగా పాటుపడ్డారో, లంబాడి బంజారా తెగల జీవన విధానం బాగుపడటానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని, అటువంటి మహనీయుల కోవకు చెందిన వాడే సంత్ సేవలల్ మహా రాజ్ అని, మన భారత దేశంలోనే కాక కర్ణాటక నుండి ఉత్తరప్రదేశ్ వరకు రాజస్థాన్ నుండి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న బంజారా జాతి జీవన విధానం కొరకు ఆయన పాటుపడ్డారని, దేశంలోని గోరు బంజారాలకు స్ఫూర్తిని నింపిన మహానుభావుడు అని, సంచార జీవితం నుండి ప్రతి బంజారా తెగలను తండ జీవితం వైపు మళ్ళించారని, మద్యం మాంసాలను మాన్పించే ప్రయత్నం చేశాడని, బంజారా తెగల అభివృద్ధికి దేశమంతటా సంచారం చేసి హితబోధ చేశాడని ఆయన అన్నారు 
          అనంతరం గిరిజన సాంప్రదాయ నృత్యమైన బంజారా డాన్స్ ను, పాఠశాల విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్యాలను వారు తిలకించి ఆనందించారు.
       ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఏవో గనియ, దుమ్మగూడెం తాసిల్దార్ అశోక్ కుమార్, ఏటీడీవో అశోక్, బంజారా సంఘం నాయకులు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఎల్ వెంకటేశ్వర్లు బన్సీలాల్, కృష్ణ, గోవింద్, రంగ, బాలియా, హరిచంద్ర నాయక్, రాముడు, వీరన్న, శ్వేత, రంజిత్, బి వెంకటేశ్వర్లు, మాలోత్ కీమా, భూక్య సాయి కౌశిక్, దేవా, రవి, మోహన్లాల్, తార చంద్, నాగులు,బి వీరన్న, బిక్ష, బాలు, సరియా, వీరు నాయక్, మదర్, రాంబాబు, చిన్న అర్జీ, సింధు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బంజారా సోదరులు, సోదరీమణులు, విద్యార్థులు విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .