సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా బహుజన కవి సమ్మేళనం
జనగామ,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ గౌడ రచయితల సంఘం ఆధ్వర్యంలో బహుజన కవి సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం మనోజ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తరువాత ప్రారంభమైన కవి సమ్మేళనంలో కవులు తమ కవితలను వినిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన కవులు కళాకారుల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ జి. కృష్ణ, సర్దార్ సర్వాయి పాపన్న జీవితం, ఆయన చేసిన పోరాటం, నిర్మించిన కట్టడాల ప్రాధాన్యతపై ప్రసంగించారు.ఈ సందర్భంగా లగిశెట్టి ప్రభాకర్, పెట్లోజు సోమేశ్వరా చారి, అయిలా సోమ నరసింహచారి, మాన్యపు భుజేందర్, పొట్టబత్తిని భాస్కర్, చిలుమోజు సాయికిరణ్, అంకాల సోమయ్య, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ వేముల సదానందం, రంగరాజు ప్రసాద్ తదితరులు పాల్గొని తమ సాహిత్యాన్ని ప్రదర్శించారు.


Comments