సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధుడు  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 

చిలుకనగర్‌లో ఘనంగా నిర్వహించిన జయంతి వేడుకలు

సామాజిక సమానత్వం కోసం పోరాడిన యోధుడు  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 

--విగ్రహానికి పూలమాలలు అర్పించిన కార్పొరేటర్ గీత ప్రవీణ్

-బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు పాపన్న

చిలుకనగర్, ఆగస్టు 18 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం చిలుకనగర్ డివిజన్‌లోని నోవా బంకెట్ హాల్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గీత ప్రవీణ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం, సామాజిక సమానత్వం కోసం, రాజకీయ న్యాయం కోసం పోరాడిన యోధుడు అని పేర్కొన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

జయంతి వేడుకల్లో సర్దార్ సర్వాయి పాపన్న కమిటీ సభ్యులు నేర్ధం భాస్కర్ గౌడ్, గజ్జల సత్యరాజ్ గౌడ్, భూత్కూరి నవీన్ గౌడ్ పాల్గొన్నారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, రామాంజనేయులు, శ్యామ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పాపన్న గౌడ్ ఆత్మస్ఫూర్తిని నేటి తరాలు తెలుసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .