సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణకు గర్వకారణం.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
హసన్ పర్తి,సెప్టెంబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56 వ డివిజన్ పరిధిలోని గోపాల్పూర్ కళ్ళు మండల జంక్షన్ వద్ద వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు సొంత నిధులతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ గర్వకారణమైన వీర మూర్తి అని సామాజిక న్యాయం,స్వాభిమానం, సమానత్వం కోసం పోరాడిన గొప్పయోధుడని కొనియాడారు.ఆయన అడుగుజాడల్లో నడిచి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గోపాల్పూర్ జంక్షన్ లో ఏర్పాటు చేస్తున్న విగ్రహం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. సర్వాయి పాపన్న ఆలోచనలతో ముందుకు సాగితేనే నిజమైన గౌరవం చూపినట్టు అని ప్రజల ఆకాంక్ష మేరకు ఈ విగ్రహ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.విగ్రహం చుట్టూ అందమైన పార్కు, సకల సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని పాపన్న గౌడ్ స్ఫూర్తితో సమాజంలో సమానత్వం, ఐక్యత,సాహస స్ఫూర్తి పెంపొందేలా కృషి చేస్తామని అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి అడుగులోనూ ప్రజలతోపాటు ఉంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిరంగి సునీల్,జక్కుల రజిత, డివిజన్ అధ్యక్షుడు కొంక హరిబాబు,గడ్డం శివరాం ప్రసాద్,గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొనగాని యాదగిరి గౌడ్,స్థానిక గౌడ సంఘం అధ్యక్షుడు చింత రమేష్,మహిళా అధ్యక్షురాలు శనిగరపు అనిత గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments