ఎల్కతుర్తి ప్రెస్ క్లబ్ కొత్త అధ్యక్షుడిగా సాతురి చంద్రమౌళి
ఎల్కతుర్తి నవంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కాకతీయ వనవిహార్‌లో సోమవారం నాడు ప్రెస్ క్లబ్ కొత్త అధ్యక్షుడు మరియు కార్యవర్గ సభ్యుల ఎన్నికలు సజావుగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా కందుకూరి రాజన్న, అధ్యక్షులుగా సాతూరి చంద్రమౌళి, ఉపాధ్యక్షులుగా చిర్ర ఉదయ్ చందర్, శ్రీ రామోజు సతీష్ చారి, ప్రధాన కార్యదర్శిగా సదా నిరంజన్, సిద్ధాంతి కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శిగా జూపాక శ్రీనివాస్, కోశాధికారిగా కందుకూరి మహేశ్వర చారిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యవర్గ సభ్యులుగా కర్రె తిరుపతి, బెజ్జంకి నరేష్, ఎర్రోళ్ల రాజబాబు, నల్లాల రాజిరెడ్డి, నార్ల గిరి మహేందర్ లు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు కందుకూరి రాజన్న, అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి మాట్లాడుతూ — “జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తాము. మీడియా సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు, రక్షణ కల్పించేందుకు ప్రెస్ క్లబ్ వంతు కృషి చేస్తుంది” అని తెలిపారు.కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments