జనోద్ధరణకు పాటుపడిన మహా నాయకురాలు సావిత్రిబాయి పూలే
టీఎన్జీవోఎస్ బాలకృష్ణ
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :
నీటిపారుదల శాఖ సర్కిల్ ఆఫీస్ నందు తొలి భారతీయ మహిళ ఉపాధ్యాయులు సంఘసంస్కర్త స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జన్మదినం పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా గగ్గురీ బాలకృష్ణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహోన్నత వ్యక్తి అని ఆ రోజుల్లోనే బాల్య వివాహాలను నిర్మూలించి, స్త్రీ జనోద్దరణకు పాటుపడిన మహనీయురాలు అని, ఆమె యావత్తు భారతదేశం గుర్తుంచుకోవలసి వ్యక్తి అని తెలుపుతూ.. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం గర్వకారణం అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పడిగ నరసింహారావు గాంధీ మల్లికార్జున ప్రసాద్ మధుసూదన్ రావు లింగమూర్తి వెంకట నరసయ్య చంద్రలేఖ ప్రమోద్ రాజ్యలక్ష్మి గంగరాజు శాంతకుమారి బ్రహ్మం శ్రీనివాస్ నికిత రాజు వెంకటరమణ విజయ్ కుమారి శ్రీదేవి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments