ఘనంగా నాగారం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఫెయిర్
నాగారం, అక్టోబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనగా సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కీసర మండల విద్యాశాఖ అధికారి జమదగ్ని, చీర్యాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ప్రధానోపాధ్యాయులు పి.సి. రాములు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలతో అనేక శాస్త్రీయ నమూనాలను ప్రదర్శించి అందరినీఆకట్టుకున్నారు. సైనికులకు చలికాలంలో వేడిగా ఉండే సోలార్ ప్యానెల్ కోట్లు, ఫ్యాక్టరీల నుండి వెలువడే కాలుష్యాన్ని ఫిల్టర్ చేసే యంత్ర నమూనాలు విశేషంగా ఆకర్షించాయి.ఈ సైన్స్ ఫెయిర్‌ను అగస్త్య ఫౌండేషన్ సభ్యులు త్రివేణి, అఫ్షాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు రమా సత్యశ్రీ, కమల, అర్చన, సంధ్యా రాణి, వందనా పర్యవేక్షణలో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, అరవింద్ కుమార్, రఘు, శ్రీదేవి, అజీజ్ అహ్మద్, పద్మ, గాయత్రి, వరమ్మ, సంజయ్ రాణీ, పాండురంగ రెడ్డి, సుప్రజ, విద్యా వాలంటీర్లు స్వప్న, పావని, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.


Comments