సత్తుపల్లి పట్టణంలో భద్రతా చర్యలు బలోపేతం.!
సంస్థల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి: సీఐ శ్రీహరి.
సత్తుపల్లి, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక పట్టణంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, ప్రజా ప్రదేశాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు.
కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజా భద్రత (చర్యలు) అమలు చట్టం–2013 ప్రకారం సోమవారం సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పట్టణంలోని షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ టి.శ్రీహరి మాట్లాడుతూ, ప్రతి సంస్థలో భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రయల్ రూములు, స్నానాల గదులు వంటి ప్రైవేట్ ప్రాంతాల్లో రహస్య కెమెరాలు అమర్చబడి ఉన్నాయేమో యాజమాన్యాలు స్వయంగా తనిఖీ చేయాలని చెప్పారు.
అన్ని ప్రదేశాలు స్పష్టంగా కనపడేలా కెమెరాలు అమర్చాలని, ఈ చర్యలను 15 రోజులలోగా అమలు చేయాలని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.


Comments